EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

శ్రీపతి పండితారాధ్య కోటేశ్వర ప్రసాద్ రాజేశ్వరి దంపతులకు ఉత్తమ ఆధ్యాత్మిక ధార్మిక సేవా పురస్కారము

బాసర జూలై 23 (ఈతరం భారతం);శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపములో శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమము( కోటి పార్థివలింగ స్తూప సహిత ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము ) మాసో త్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమములు, అధ్యాత్మిక ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవం గా జరిగినవి. ముందుగా దీపారాధన,కలశస్థాపన, పుణ్యాహవచనము ,లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య, కోటి పార్థివ లింగ సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకము , కుంకుమార్చన ,గణపతి, నవగ్రహ ,రుద్ర ,సరస్వతి హోమములు, భూదాన సంకల్ప పూజ, మరియు అన్నదానము ఘనంగా జరిగింది.సాంస్కృతిక కార్య కార్యక్రమంలో భాగంగా శివ పూజధురం ధరలు, శ్రీ శైవ మహా పీఠం జంట నగర శాఖ కార్యదర్శి శ్రీపతి పండితారాధ్య కోటేశ్వర ప్రసాద్ రాజేశ్వరి దంపతులకు ఉత్తమ ఆధ్యాత్మిక ధార్మిక సేవా పురస్కారము ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు నిర్మల సంధ్యా అంబికానాధర్మ దంపతులు అందజేశారు. నిజామాబాద్ వాస్తవ్యులు శివం డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యాచార్యులు శ్రీ గుజరాతి స్వాతి శిష్యులు చక్కని నృత్యాభినయంతో కళా ప్రియులను కట్టి పాడేశారు.పదాలకు అనుగుణంగా అడుగులు వేస్తూ భావాలకు అద్దం పట్టేలా అభినయిస్తూ ప్రదర్శించిన నృత్యాంశములు అందరిని ఆకట్టుకున్నాయి.. ఉత్తమ ఆధ్యాత్మిక ధార్మిక సేవ పురస్కార గ్రహీతలు శ్రీపతి పండితారాధ్యుల కోటేశ్వర ప్రసాద్ సభలో మాట్లాడుతూ బాసర సరస్వతి క్షేత్రము లో ఈ పురస్కారం అందుకోవడము ఆనందము గా మరియు గర్వము గా ఉన్నదని మరియు ద్వాదశ జ్యోతిర్లింగ మందిరము లో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రతి నెల మాసోత్సవము సందర్భముగా ప్రత్యేక పూజ కార్యక్రమములు, సంగీత, సాహిత్య,నృత్య, ధార్మిక , ఆధ్యా త్మిక కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని మరియు ఆశ్రమ అభివృద్ధికి మేమంతా సహకరిస్తామని అన్నారు. మరియు శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి ని కొనియాడినారు. గంప సదానందం భూలక్ష్మి, కొల్లూరి శ్రీనివాస్ మమత,డా, సాయిరాం డా ,అమూల్య దంపతులు, మంచిర్యాల శ్రీ విశ్వనాథ దేవాలయ అభ్యర్థి కమిటీ సభ్యులు శ్రీపురం శ్రీనివాస్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top