EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీ

ఈతరం భారతం అప్పారావు పేట సెప్టెంబర్ 21:

_____________________________________

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.తన స్వగ్రామమైన గండుగులపల్లి గ్రామం నుండి అప్పారావుపేట ఫ్యాక్టరీకి చేరుకున్న మంత్రి ప్లాంట్ పనితీరును, సామర్థ్యాన్ని పరిశీలించారు.అనంతరం ఫ్యాక్టరీ వద్ద అన్‌లోడింగ్ కోసం వేచి ఉన్న ట్రాక్టర్ల వద్దకు వెళ్లి రైతులతో ఆయన నేరుగా మాట్లాడారు. అన్‌లోడింగ్ సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని రైతులను అడిగి తెలుసుకోగా.. ప్రక్రియ అంతా సజావుగానే జరుగుతోందని, ఎలాంటి సమస్యలు లేవని వారు మంత్రికి స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం సీజన్ కావడం వల్ల రద్దీ కాస్త ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని అన్‌లోడింగ్, క్రషింగ్ త్వరగా పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, రైతులకు ఆయన సూచించారు.

రవాణా సమస్యల పరిష్కారానికి ఆదేశం..

ఫ్యాక్టరీ నుంచి బై ప్రొడక్ట్స్ (ఉప ఉత్పత్తులు) కొనుగోలు చేసిన వారిని స్థానిక లారీ ఓనర్స్ యూనియన్ ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రధాన సమస్య మంత్రి దృష్టికి వచ్చింది. యూనియన్ వారు ఫ్యాక్టరీ వద్ద లారీలు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించారు. ఈ లారీ రవాణా సమస్యపై సంబంధిత ఆర్టీవో అధికారితో మాట్లాడి తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.

Related News

Select the Topic
Scroll to Top