ఈతరం భారతం కొత్తగూడెం: అక్టోబర్ 5:
_________________________________
సింగరేణి కార్మికుల కష్టంతో సాధించిన బొగ్గు విక్రయాల ద్వారా సంస్థకు వచ్చిన నికర లాభాలను తక్షణమే వెల్లడించాలని, అందులో కార్మికులకు రావాల్సిన 36 శాతం లాభాల వాటాను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు.
సోమవారం కొత్తగూడెం ఏరియా టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గనులు, వివిధ డిపార్ట్‌మెంట్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రక్తం చిందిస్తూ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారని, వారి కష్టానికి తగిన గుర్తింపు, హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగరేణి వార్షిక లాభాలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే ప్రకటించాలని ఆయన కోరారు. కార్మికులకు రావాల్సిన 36 శాతం లాభాల వాటాను ఆలస్యం చేయకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి వాస్తవ లాభాల ఆధారంగా కార్మికులకు లాభాల వాటా చెల్లించిన వివరాలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాభాల వాటా విషయంలో కార్మికులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రకటించిన లాభాల వాటాలో కూడా గతంతో పోలిస్తే సగం మాత్రమే చెల్లించారని పేర్కొన్నారు















