EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. 

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 4

బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదంను పరిశీలించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులతో మాట్లాడి వారిని పరామర్శించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావు పేట, గుంటూరు నుండి 20 ఏళ్ల క్రితం బ్రతుకుదెరువు కోసం వచ్చారు. పెదవాళ్లకు అందుబాటులో ఉంటే ఫర్నిచర్ అమ్ముకుంటున్నారు. ఇక్కడే షాపు నడుపుతూ, నివాసం ఉంటున్నారు. కరెంటు లైన్ తెగిపడి అగ్ని ప్రమాదం జరగడంతో 20 ఏళ్లనుండి సంపాదించుకుంది సర్వం కళ్ళముందే కాలిపోయింది. ఎమ్మెల్యే వివేకానంద, కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, స్థానిక నాయకులతో కలిసి ప్రమాదాన్ని పరిశీలించాను. హృదయవిదారకంగా ఉంది.కట్టుబట్టలతో మిగిలిపోయారు. మానవతా కోణంలో స్పందించమని కోరుతున్నారు. కలెక్టర్ తో మాట్లాడి మావంతు సాయం అందిస్తాము. మళ్ళీ వ్యాపారం చేసుకోవడానికి కావలసిన శక్తి అందేలా చూస్తాం. హైదరాబాదులో చాలా చోట్ల కరెంటు తీగలు వేలాడబడుతున్నాయి. బిల్డింగ్ మీద నిలబడితే చేతికి అందేలా ఉన్నాయి. అనేకమంది పెద్దలు పిల్లలు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ మాటలకే పరిమితం అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కూడా సరైన భద్రత ఉండడం లేదు. తక్షణమే వీటిమీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న అని చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top