హైదరాబాద్ మార్చ్ 3 ఈతరం భారతం:
ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు గారు హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.కాగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రంగులు పూసుకుని నాయకులు, రాష్ట్ర అధికారులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఐక్యత, స్నేహభావం, సామరస్యాన్ని ప్రతిబింబించేలా వేడుకలను జరుపుకున్నారు.















