ఈతరం భారతం హైదరాబాద్, సెప్టెంబర్ 10 గురువారం
___________________________________________
స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI), సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడిగాఎం. మనిదీప్ యాదవ్ నియమితులైనారు. ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్ జీ గారి ఆమోదంతో, తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి జీ నియామకాన్ని ప్రకటించారు.సికింద్రాబాద్ జిల్లాలో ఎన్ఎస్యూఐ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, సమర్థవంతమైన సమన్వయాన్ని సాధించడం, విద్యార్థులతో అనుసంధానాన్ని పెంపొందించడం మరియు జిల్లాలో ఎన్ఎస్యూఐ కార్యకలాపాలను మరింత విస్తరించడం ఈ నియామక ప్రధాన లక్ష్యం.
తన నియామకంపై ఎం. మనిదీప్ యాదవ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం మరియు విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఎన్ఎస్యూఐ జాతీయ అధ్యక్షులు వినోద్ జాఖర్ జీ, తెలంగాణ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షులు యాదవల్లి వెంకటస్వామి జీ, ఎన్ఎస్యూఐ ఆల్ ఇండియా కో-కన్వీనర్ ఎం.డి. అక్బర్ జీ గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే, సికింద్రాబాద్ మాజీ ఎంపీ ఎం. అంజన్ కుమార్ యాదవ్ , రాజ్యసభ సభ్యులు; ఎం. అనిల్ కుమార్ యాదవ్ ఎం. అరవింద్ కుమార్ యాదవ్ , జనరల్ సెక్రటరీ, తెలంగాణ యువజన కాంగ్రెస్ మధు సుధన్ , సికింద్రాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గౌరి సతీష్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి మరియు సికింద్రాబాద్ జిల్లా ఇన్చార్జ్ మరియు ఎస్. ధనరాజ్ మాజీ డైరెక్టర్, సెట్విన్ కార్పొరేషన్,లు తనపై చూపుతున్న నిరంతర మార్గదర్శకత్వం, సహకారం మరియు ప్రోత్సాహానికి మనిదీప్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.















