EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎప్పటిలాగే కొండెక్కిన చమురు ధర…

ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 10 గురువారం

___________________________________________

కొండెక్కిన చమురు ధర.. ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎంసీ)లకు గుదిబండగా మారింది. దీంతో ఓఎంసీలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.23 చొప్పున నష్టపోతున్నాయి. గృహ అవసరాలకోసం సరఫరా చేసే ఒక్కో వంట గ్యాస్‌ సిలిండర్‌పైనా ఓఎంసీలు రూ.200వరకు నష్టపోతున్నాయి. ముడిచమురు ధర పెరుగుదలకు అనుగుణంగా ఓఎంసీలు గత మూడు నెలలుగా తమ రిటైల్‌ ధరలు పెంచకపోవడం ఇందుకు ప్రధాన కారణం.109 డాలర్లకు చమురు దిగుమతి ధర: మన దేశం దిగుమతి చేసుకునే ప్రధాన ముడి చమురు రకాల సగటు ధర ఏకంగా 109 డాలర్లకు చేరింది. దీంతో ధరల సెగను కట్టడి చేసేందుకు అక్టోబరు 7న వెలువరించే ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ కీలక రెపో రేటును పావు శాతం నుంచి అర శాతం వరకు పెంచుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top