EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఓయు ప్రొఫెసర్ మనోహర్ ను సస్పెండ్ చేయడం అన్యాయం

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 22

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకులుగా పని చేస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ మనోహర్ ను అకారణంగా యూనివర్సిటీ యజమాన్యం సస్పెండ్ చేయడం చాల అన్యాయమని అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ( క్యాష్) అమలులో ప్రమోషన్ పొందని యూనివర్సిటీ అధ్యాపకుల తరపున ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) గత యాభై రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తున్న వారికి నాయకత్వం వహిస్తున్న ఆచార్య మనోహర్ రావు ను సస్పెన్షన్ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు ప్రజాస్వామ్యబద్ధంగా ఉపాధ్యాయుల సమస్యలను వైస్ చాన్సలర్,రిజిస్టార్ ల దృష్టికి తీసుకుపోయే బాధ్యత ఔట కు ఉందని, ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా, సమస్యలను పరిష్కరించకుండా సస్పెండ్ చేయడమే పరిష్కారం అనుకోవడం యజమాన్యానికి తగదు అన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యతను దెబ్బతీయడానికి యూనివర్సిటీలో కొంతమంది, కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నారని, దీనికి ఆజ్యం పోసే విధంగా యూనివర్సిటీ రిజిస్టర్ నరేష్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, దీనిని ఉపాధ్యాయ సమాజం గమనించి బిసి ఎస్సి ఎస్టి ఐక్యత దెబ్బతీసే విధంగా వ్యవహరించకుండా ఐక్యమ త్యంతో ఉండాలని జజూల సూచించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోనీ ప్రొఫెసర్ మనోహర్ ను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు

 

 

Related News

Select the Topic
Scroll to Top