EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

చదువులు గాలికి వదిలేసి గాంధీ విగ్రహానికి డబ్బులు తగిలే స్తున్న రేవంత్ ఖాన్ ప్రభుత్వం

హైదరాబాద్ మార్చ్ 4 ఈతరం భారతం:

విద్యా ఉద్యోగాలను తుంగలో తొక్కేసి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పిన రేవంత్ ఖాన్ ప్రభుత్వం విద్యను పట్టించుకోకుండా విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వకుండా కళాశాలలో ఇవ్వవలసిన రీయంబర్స్మెంట్ ఫీజులు కూడా ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆదుకుంటుందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మరియు ఖైరతాబాద్ నగర కార్యదర్శి ఎం.ప్రణయ్ కుమార్ విమర్శించారు.అన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కూడా ప్రైమరీ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలలో ఏన్ని భర్తీ చేయకుండా రేవంత్ ప్రభుత్వం సమస్యలను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు.ప్రస్తుతం ఏ వీధిలో చూసినా ఏ గ్రామంలో చూసినా గాంధీ విగ్రహాలకు కొదవలేదు. కానీ ప్రత్యేకంగా రేవంత్ స్థాపించే గాంధీ విగ్రహానికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పైన లేని ఆత్రుత గాంధీ బొమ్మ పైన మాత్రమే ఎందుకు ఉందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.53,463 మందికి విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్లు 9000 కోట్లు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా గాంధీ విగ్రహం కొరకు 5000 కోట్లు ఖర్చు పెట్టాలనుకోవడం ఆయన ప్రజా పాలన అని చెప్పుకునే ప్రభుత్వానికి ఎంతవరకు సార్ధకం అవుతుందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. సమాజంలో విద్య ఆరోగ్యం మెరుగుపడినప్పుడు మాత్రమే సమ సమాజ అభివృద్ధి చెందినట్లుగా భావిస్తుంటాం. కానీ రేవంత్ రెడ్డి దృష్టిలో గాంధీ విగ్రహం నెలకొల్పుకుంటే రాష్ట్ర అభివృద్ధి జరిగినట్లుగా భావిస్తుందని అనుకోవడం ఆయన అవగాహన లోపాన్ని తెలియజేస్తుందన్నారు. ప్రజా సమస్యలు పట్టని రేవంత్ రెడ్డికి తనను నిలువునా కోసినా కూడా డబ్బులు లేవని పత్రికా ప్రకటనలు ఇచ్చిన వ్యక్తికి ఈరోజు గాంధీ విగ్రహం నెలకొల్పడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేసారు.

Related News

Select the Topic
Scroll to Top