EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

చిలుకా నగర్ లో ఘనంగా ‘మార్కండేయ’ జయంతి వేడుకలు

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 22

పద్మశాలీల ఆరాధ్య దైవం ‘భక్త మార్కండేయ” జయంతి కార్యక్రమాన్ని ‘చిలుకా నగర్ పద్మశాలి సంఘం’ ఆధ్వర్యంలో స్థానిక మార్కండేయ మందిరంలో ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు సకినాల ప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో పద్శశాలి సంఘం పెద్దలు, కులబాంధవులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. కాలచక్రాన్ని జయించిన మార్కండేయుని వంశంలో పుట్టిన పద్మశాలీలు అత్యంత గొప్పవారు, ప్రతిభాశీలురని అన్నారు. ఎంతో చైతన్యవంతమైన పద్మశాలీలు ప్రస్తుత సమాజానికి మరింత దిశానిర్ధేశం చేయాలన్నారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తాను తొలిసారిగా మార్కండేయ దేవాలయాన్ని సందర్శించినట్లు, భక్త మార్కండేయ స్వామి కృపా కటాక్షాలు తనపై మెండుగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనందుకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, స్థానిక పద్మశాలి సంఘం విజ్ఞప్తి మేరకు మార్కండేయ దేవాలయంలో ఖాళీ స్థలంలో పై కప్పు రేకుల తో పూర్తిస్థాయి పనులు చేపట్టి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.పద్మశాలి సమాజ సంక్షేమానికి, అభివృద్ధికి తాము నిరంతరం సహకరిస్తామని నాయకులు తెలిపారు. మార్కండేయ ఆలయ అభివృద్ధికి సైతం సహకరిస్తామన్నారు. అనంతరం సంగీశెట్టి శ్రీధర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, క్రమబద్ధంగా నిర్వహించబడినందుకు స్థానిక ప్రజలు, భక్తులు నిర్వాహకులను అభినందించారు.ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ,ఎంబీసీ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ , ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ దేవసాని బాలచందర్, తెలంగాణ పద్మశాలి మహాసభ కన్వీనర్ భారత సుదర్శన్, సీనియర్ జర్నలిస్టు,బోల్లిగూడ పద్మశాలి సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ మహేశుని లక్ష్మయ్య నేత , వడ్డేపల్లి కిశోర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి పెండెం నాగార్జున, అడ్డగట్ల భవానంద్, దాసరి శ్రీనివాస్, గూడ శ్రీశైలం, కోడెం రమేష్, దేవసాని బాలచందర్, చేర్యాల శ్రీనివాస్, నర్సింగ్ నేత,గూడ శ్రీశైలం, ప్రభాకర్, సకినాల చందు, సబ్బని సతీష్, యువనేత పాము రాజేష్,గుంజరి కుమార్,దేవసాని వివేక్,రాచకొండ శివకుమార్, సత్యనారాయణ, చంద్రశేఖర్, ప్రసాద్, రాజేష్, ప్రవీణ్, కుమార్, సకినాల శ్వేత, మౌనిక, అమారేశ్వరి, రేణుక, చిన్నారులు, స్థానిక ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు. చిల్కానగర్‌లో భక్తి, ఐక్యత, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా విజయవంతంగా ముగిశాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top