ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 23
ఉప్పల్ మునిసిపాలిటి పరిధిలోని చిల్కా నగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతి మాత జయంతితో పాటు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ దేవసాని బాలచందర్ హాజరై విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోటు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులందరినీ ఆయన అభినందించారు. ee సందర్బంగా బాలచందర్ మాట్లాడుతూ, తాను కూడా తన బాల్యంలో ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసినట్లు, ఉప్పల్ ఉన్నత పాఠశాలలో గడిపిన తన పాఠశాల జీవితాన్ని స్మరించుకుంటూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువుల్లో మరింత రాణించాలని ఆకాంక్షించారు.గురువుల పట్ల విధేయత, చదువుల పట్ల శ్రద్ధతో ముందుకెళ్లి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.పదవ తరగతి పరీక్షల ప్రాధాన్యతను వివరిస్తూ, ప్రణాళికాబద్ధమైన చదువు, సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. అలాగే 9వ తరగతి విద్యార్థులు కూడా ఇప్పటినుంచే సరైన ప్రణాళికతో చదివి 9–10 తరగతులకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని హితవు పలికారు.ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేస్తూ, పదవ తరగతిలో అత్యధిక మార్కుతో ఉత్తీర్ణులైన విద్యార్థికి రూ.5,000 నగదు బహుమతి, ద్వితీయ స్థానంలో ఉత్తీర్ణులైన విద్యార్థికి రూ.2,500 నగదు బహుమతి స్వయంగా అందజేస్తానని ప్రకటించారు.కార్యక్రమంలో విద్యార్థులు సరస్వతి మాత యొక్క గొప్పతనాన్ని, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జీవితం నుండి నేర్చుకోవలసిన విలువలను వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో తిరుపతి సత్యనారాయణ, సంగి స్వామి యాదవ్, శామీర్పేట చంద్రయ్య, ఓర్స్ శేఖర్, బోడ విద్యాసాగర్, ఐలేశ్వరి, ఆలే నరేంద్ర, జెర్రిపోతుల కిషన్, ప్రకాష్, కృష్ణారెడ్డి వివేక్, శివ, సందీప్, వెంకటాచారి, గౌతం, శ్రీకృష్ణ, తో పాటు పాఠశాల ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.















