EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తోన్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు చేపట్టాలి

హైదరాబాద్ మార్చ్ 3 ఈతరం భారతం:

నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తోన్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో ఆందోళన చేపట్టారు.గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని నినాదాలు చేసారు.ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ మూసీ నదిలోనే భారీ అంతస్తుల భవనాలను కడుతుంటే హైడ్రాకు కనబడటం లేదు. కానీ కుత్భుల్లాపూర్ లో పేదల ఇళ్లను కూల్చేశారు. ఖమ్మంలోని వెలుగుమట్లలో పేదల ఇళ్లను అక్రమంగా కూల్చేశారు. మూసీలో కూడా పేదవాళ్ల ఎంతో మంది ఇళ్లను కూల్చేశారు. కానీ మూసీ లో కడుతున్న ఈ బిల్డింగ్ మాత్రం హైడ్రా రంగనాథ్ కు , ప్రభుత్వానికి కనబడటం లేడా అని ప్రశ్నించారు..రంగనాథ్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఉన్నానని చెప్పారు. ఆయన బుల్డోజర్లు తెచ్చే వరకు కూడా మేమంతా ఇక్కడే ఉంటాం. జనం బాటలో భాగంగా చెరువులు, నదులు అక్రమించి కట్టిన బిల్డింగ్ ల గురించి మనం కంప్లైంట్స్ ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. అదే ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు కూల్చేశారు.. త్వరలోనే అక్కడకు వెళ్తాం మన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో సిటీలోని మధు రిడ్జ్ అపార్ట్ మెంట్ వాళ్లను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎంతో మంది మధ్య తరగతి వాళ్లు కష్టపడి అక్కడ అపార్ట్ మెంట్లు కొనుక్కున్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం కట్టిన ఆ అపార్ట్ మెంట్ వాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే కడుతున్న, ఎవరికీ నష్టం లేని బిల్డింగ్ ను మాత్రం ఆపటం లేదు. మాకు ప్రైవేట్ వాళ్లతో ఎలాంటి పంచాయితీ లేదు. ప్రభుత్వంతోనే మా పంచాయితీ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ ల నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలల పాటు ఈ నిర్మాణాలను ఆపారు. కానీ ఆ తర్వాత ఆమ్యమ్యాలు తీసుకొని మళ్లీ నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే మా పోరాటం. కచ్చితంగా మూసీని, తెలంగాణ వనరులను పరిరక్షించుకుంటామని కవిత పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top