ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 22:
2019లో తనకు క్యాన్సర్ ఉందని, త్వరలోనే చనిపోతానంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేయించారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆరోపించారు.కేటీఆర్ ఆధ్వర్యంలో నడిచిన పార్టీ సోషల్ మీడియా తనపై అసభ్య వ్యాఖ్యలు చేయించిందని, తన గురించి పూర్తిగా తెలిసినవాళ్లే ఇలా చేయడం బాధించిందని అన్నారు.తనతో ఫోటోలు దిగినా కార్యకర్తలను సస్పెండ్ చేశారని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని ఎన్నిసార్లు అడిగినా కేసీఆర్ పట్టించుకోలేదని, తన లేఖతో వెళ్తే సీఎం రిలీఫ్ ఫండ్ కేవలం రూ.60 వేలే వచ్చేదని చెప్పారు.రాజకీయాలతో సంబంధం లేని తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని, లిక్కర్ కేసులో తాను 11 ఫోన్లు అప్పగిస్తే, కేటీఆర్ మాత్రం ల్యాప్‌టాప్ ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు.















