ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 16:
__________________________________
రాష్ట్రవ్యాప్తంగా 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన 37 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతులు రావాల్సి ఉండగా కొందరు అధికారులు కోర్టులను ఆశ్రయించడంతో కొంతకాలంగా పదోన్నతుల ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ చొరవ తీసుకుని డీజీపీ కార్యాలయంలో ఆయా బ్యాచ్‌ల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పంతాలకు పోయి పదోన్నతులు ລ້ວ 1991, 1995, 1996 డీఎస్పీలకు డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. పదోన్నతుల విషయంలో నెలకొన్న సమస్యను పరిష్కరించేందుకు తాను చొరవ తీసుకుంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు
కోర్టు కేసుల కారణంగా పదోన్నతుల ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతోందని ఈ సందర్భంగా డీజీపీ వివరించారు. కేసులను కొనసాగించడం వల్ల అధికారులు నష్టపోవద్దని సూచించారు. సమస్య పరిష్కారం కోసం తాను ముందుండి ప్రయత్నిస్తానని, అందరూ సహకరిస్తే త్వరగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న 37 అదనపు ఎస్పీ ఖాళీలకు వెంటనే పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీజీపీతో సమావేశం అనంతరం వరంగల్ జోన్‌కు చెందిన 1991, 1995, 1996 బ్యాచ్‌ల అధికారులు కోర్టులో దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు డీజీపీకి అందించారు. హైదరాబాద్ సిటీకి చెందిన ఆయా బ్యాచ్‌ల అధికారులు కూడా కేసుల ఉపసంహరణకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో డీజీపీ చొరవతో సమస్య పరిష్కారం దిశగా కదలిక రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.















