ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 10
తెలంగాణలో బుధవారం జరగనున్న మునిసిపల్ కార్పొరేషన్లు మునిసిపాలిటీల సాధారణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ రోజును పెయిడ్ హాలిడే గ ప్రకటిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సెలవు ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు కార్పొరేషన్ల పరిధిలోని అన్ని ఫ్యాక్టరీలు దుకాణాలు వాణిజ్య సంస్థలు పారిశ్రామిక సంస్థల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగులు అందరికీ వర్తిస్తుంది















