హైదరాబాద్, అక్టోబర్ 10 (ఈతరం భారతం);: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంఘం అధినేత ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ ..14న బీసీ ల రాష్ట్ర బంద్ కు ఆర్ కృష్ణయ్య పిలుపునిచారు.శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం లో మాజీ స్పీకర్ మధుసూదనా చారి , మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో పాటు 30 బిసి సంఘాల నేతలు పాల్గొన్నారు. ee సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను రెండు వారాల పాటు ఆపడమనేది దురదృష్టకరం. ఎందుకంటే ఎన్నికల నోటిఫి sషన్ విడుదలయ్యాక ఎన్నికలను ఆపొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉ న్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేయడం తాము తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగిస్తుంది. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. బీసీ రిజర్వేషన్లు పెంచిన ప్రతిసారీ రిజర్వేషన్ వ్యతిరేకులు కోర్టులను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారని, కోర్టులు కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని విమర్శించారు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ కోరాలన్నారు. నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారు. నిన్నటి నుంచి విచారణ జరిపిన కోర్టు.. మరో రెండు రోజులు సమయం తీసుకుని ఇంకా విస్తృతంగా విచారణ చేపట్టాల్సి ఉ oడే. ఎందుకు ఆదరబాదరగా స్టే విధించాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.’మండల్ కమిషన్ ఉద్యమం తరహాలో.. ధర్నాలు, రాస్తా రోకోలు, ఆందోళనలతో తెలంగాణను స్తంభింపజేస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయస్థానం స్టే ఇవ్వడం సరికాదు. నోటిఫికేషన్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా… స్టే విధించి బీసీల హక్కులకు విఘాతం కలిగించారు. అన్ని పిటిషన్లను రెండు రోజులపాటు సమగ్రంగా విచారిం చాల్సి ఉన్నప్పటికీ హడావిడిగా ఎందుకు తీర్పు ఇచ్చారు?’ అని కృష్ణయ్య ప్రశ్నించారు.బీసీల్లో ఏంతో చైతన్యం వచ్చింది.. ఊరురా స్పందన తెలుపుతాం. దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుంది. ఏం తమాషాగా ఉందా.. బీసీలంటే అంత చులకనగా ఉందా.. ముఖ్యమంత్రి పదవులు రావు మంత్రి పదవులు రావు.. లేక లేక సర్పంచ్ అవకాశం వస్తే వాటిని కూడా లాగేసుకోవడం సరికాదు. ఈ సమాజంలో బీసీల సత్తా ఏంటో చూపిస్తాం. స్టే విధించడం చాలా దురదృష్టకరం. రేపట్నుంచి రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశం లో బిసి సంఘాల నేతలు చెరుకు మణికంఠ, రాజునేత,బిసి మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సుప్రజా, పగిల సతీష్ , రాందేవ్ , నిఖిల్, చిక్కుడు బాలయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.















