ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 8
ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు డా. పెరుక రాజు గారికి సాహిత్యంలో చేస్తున్న అవిరళ కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన మాజీ రాష్ట్రపతి డా ఏపిజే అబ్దుల్ కలాం పురస్కారం తనను వరించిoది. సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో ఆయన చేస్తున్న అసాధారణ సాహిత్య ప్రతిభ కు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
త్యాగరాయ గాన సభ హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేడు ఈ పురస్కారాన్ని ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో జి విజయ కుమార్ చిత్ర దర్శకులు, నిర్మాత, సుప్రీం కోర్టు జడ్జ్ బూరుగుల మధు సుధన్, భారత కళాక్షేత్రం డా. రంజిత్, నటి లక్ష్మి, డా విబి వసంత రాయలు, స్నేహిత్ విద్యా మరియు సాహితీ ప్రముఖుల సన్నిధిలో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు, సాహితీ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.
భరతమాత గర్వించే తెలంగాణ ముద్దుబిడ్డ అయిన డా. పెరుక రాజు గారు ప్రస్తుతం దేశ రక్షణ శాఖ – భారత ఆర్మీ విభాగంలో జూనియర్ అధికారి హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు.జాతీయ కవిగా, రచయితగా, అనువాదకుడిగా డా. పెరుక రాజు గారు అనేక భారతీయ భాషల మధ్య భావాలను, సంస్కృతులను సమన్వయం చేస్తూ విశేష గుర్తింపు పొందారు. వివిధ భారతీయ భాషల పదమూడవ సంపుటి “సాగు” త్వరలో విడుదల కానుంది.సాహిత్యంతో పాటు సామాజిక సేవలోనూ డా. రాజు గారు ముందున్నారు. పేద, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలనే లక్ష్యంతో “మై గిఫ్ట్” అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవలందిస్తున్నారు. “ప్రోత్సహించడమే నిజమైన బహుమతి” అన్నది ఆయన జీవన తత్వం.
ఇంతకుముందు కూడా డా. పెరుక రాజు గారు స్వర్ణ కంకణం, నంది అవార్డు, జాతీయ ఉత్తమ కవితా పురస్కారం, సంక్రాంతి విశిష్ట కవి రత్న పురస్కారం ఇంకా ఎన్నో ప్రతిష్ఠాత్మక గౌరవాలను పొంది, జాతీయ స్థాయిలో ప్రముఖ సాహిత్య స్వరంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.ఆయనకు లభించిన ఈ పురస్కారాన్ని జవాన్ మరియు కిసాన్ ల కు అంకితం చేశారు.
ఈ గౌరవం డా. రాజు గారి సాహిత్య ప్రతిభకే కాకుండా, ఆయనలోని జాతీయ విలువలు, సామాజిక బాధ్యత, సాంస్కృతిక ఐక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఆయన సాహితీ సందేశం ప్రతి హృదయాన్ని ఆలోచింపజేసింది. చిన్నారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరింప చేశాయి.















