EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కుంభమేళా మోనాలిసా

ఈతరం భారతం హైదరాబాద్ మార్చ్ 11

కుంభమేళా సమయంలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియాలో వైరల్ అయిన మోనాలిసా భోస్లే తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ఒక ఆలయంలో తన ప్రియుడు ఫర్మన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది.ఈ వివాహ వేడుకకు కేరళ మంత్రి వి. శివన్‌కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌తో పాటు సినిమా షూటింగ్ టీమ్ సభ్యులు కూడా హాజరైనట్లు సమాచారం.పెళ్లికి ముందు మోనాలిసా తన ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. తామిద్దరం ప్రేమించుకున్నామని, కానీ తమ ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని పోలీసులకు తెలిపింది.తన తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలని కోరిన తర్వాత పోలీసుల సమక్షంలోనే ఆ జంట ఆలయానికి వెళ్లి వివాహం చేసుకుంది.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్‌తో సోషల్ మీడియా తో పరిచయం ఏర్పడింది. ఫేస్‌బుక్‌లో మొదలైన ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది.గత ఏడాదిన్నరగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. అయితే మతాలు వేరు కావడంతో ఈ పెళ్లికి మోనాలిసా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.

Related News

Select the Topic
Scroll to Top