EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఎన్నికల హామీల్లో ప్రకారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్

ఈతరం భారతం అక్టోబర్ 10 ఖమ్మం: కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే కేబినెట్ లో ఆమోదం పొందుపరిచి బీసీ రిజర్వేషన్ ప్రవేశపెట్టిందని కార్పొరేట్, బీసీ సంఘం నాయకులు కమర్తపు మురళీ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ తోనే ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిపారు.

రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగానే 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడుతుందని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగే ప్రసక్తే లేదని అయన తెలిపారు. కేబినెట్ లో మంత్రులు బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత కోర్టులో పిటిషన్ వేసి వాదులను వినిపించి బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించుకుంటామన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో డిప్యూటీ మేయర్ జోహార ఫాతిమా, మార్కెట్ కమిటీ చైర్మన్ యారగర్ల హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top