ఈతరం భారతం అక్టోబర్ 9 ఖమ్మం : ఖమ్మం డిపో పరిధిలో ప్రయాణికుల సమస్యలు మరియు సూచనలు తెలుసుకొనుట కొరకు శుక్రవారం 10-10-2025 డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టి జి ఎస్ ఆర్ టి సి ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. కార్యక్రమం సాయంత్రం 3.00 గంటల నుండి 4.00 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ప్రయాణికులు 9959225958 నంబర్ కు ఫోన్ చేసి సమస్యలను/ సూచనలను తెలియజేయ వలసి నదిగా కోరారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.















