ఈతరం భారతం డిసెంబర్ 21 మహబూబాబాద్:
మహబూబాబాద్ నగరంలో తెలంగాణ లో మొట్టమొదటి సారిగా ఏక్ జాత్ ఏక్ సాత్ అనే పేరుతో ఢాడి బంజారాల కుటుంబాల పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఘనంగ నిర్వహించడం జరిగింది,వృత్తి పరంగా, వ్యాపారాల పరంగా జాతీయ ఎన్నో ప్రాంతాల్లో నివాసం ఉంటున్న కుటుంబాలకు ఒకే చోట చేర్చి పరిచయ వేదికగా మార్చుకొని రాబోయే రోజుల్లో కుటుంబలాన్ని కలిసి ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి బాంబే,గుజరాత్,మహారాష్ట్ర,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుండి సకుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది ఎన్నో సంవత్సరాల తర్వాత ఇంత మందిని కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్యక్రమానికి వచ్చిన వారు తెలిపారు వచ్చిన అతిధులకు జ్ఞాపికలు మరియు శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమాన్ని ధోన్వాన్ పాండు,ధోన్వాన్ శ్రీనివాస్, జాడ్ పోడ్ ప్రసాద్,దేవత్ గోపాల్, రుడావత్ శ్యామ్,రుడావత్ జయరాం,రుడావత్ సాయి రామ్, రుడావత్ సురేష్,దేవత్ హేమ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.















