ఈతరం భారతం మహబూబాబాద్ అక్టోబర్ 16 :మహబూబాబాద్ మెడికల్ కళాశాలలో చదువుకుంటున్న భావి వైద్యుల పరీక్షల కోసం లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో పెండెం బచ్చమ్మ అనే శతాదిక వృద్ధురాలి మృతదేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కళాశాలకు గురువారం కుటుంబసభ్యులతో కలిసి అప్పగించారు. *ఈ.. ఆదర్శ సంఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి..
మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండల కేంద్రానికి చెందిన పెండెంబచ్చమ్మ (105) బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. బచ్చమ్మ మృతదేహాన్ని అప్పగింత కార్యక్రమం లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి వీరన్న ఆధ్వర్యంలో గురువారం జరిగింది. కార్యక్రమానికి జోన్ చైర్మన్ మాధవపెద్ది వెంకట్ రెడ్డి, డిస్ట్రిక్ట్ బాద్యులు అనుమాల వెంకటేశ్వర్లు, టియుడబ్ల్యూజే(ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, నేత్ర, శరీర, అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరికిపండ్ల అశోక్ తదితరులు హాజరయ్యారు. ఈ.. సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ వీరన్న మాట్లాడుతూ.. కురవికి చెందిన బచ్చమ్మ తన మరణానంతరం తన మృతదేహం సమాజానికి ఉపయోగపడాలని భావించారు. బచ్చమ్మ మేనల్లుడు సీనియర్ పాత్రికేయులు గుంటి సురేష్ సలహాతో లయన్స్ క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి 10-04-2024న బచ్చమ్మ నుంచి మెడికల్ కాలేజీకి ఆమె దేహాన్ని అప్పగించడానికి అంగీకారపత్రాన్ని స్వీకరించారు. బుదవారం కురవిలో పెండెం బచ్చమ్మ తుదిశ్వాస విడిచారు. బచ్చమ్మ మృతదేహాన్ని మహబూబాబాద్ మెడికల్ కళాశాలకు తీసుకుని వెళ్లి, లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న పర్యవేక్షణలో కుటుంబసభ్యులు మెడికల్ కళాశాలకు అందజేశారు. లయన్స్ క్లబ్ అద్యక్షుడు డాక్టర్ వీరన్న మాట్లాడుతూ.. కురవికి చెందిన బచ్చమ్మ తన మరణానంతరం తన మృతదేహం సమాజానికి ఉపయోగపడాలని భావించారని అన్నారు. బచ్చమ్మ మేనల్లుడు సీనియర్ పాత్రికేయులు, టియుడబ్ల్యూజే(ఐజేయు) కురవి మండల అధ్యక్షుడు గుంటి సురేష్ ప్రమేయంతో ఈ.. ఆదర్శ కార్యక్రమం సుసాధ్యం అయ్యిందన్నారు. సమాజంలో ఏ మతానికి చెందిన వారైనా తమ ఆచారాలను అనుసరించి కాల్చడం, పూడ్చి వేయడం జరుగుతుందన్నారు. కాని చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడేలా భావివైద్యుల కోసం, వారి పరీక్షలకు ఉపయోగపడుతుందని భావించి బచ్చమ్మ ముందుకు రావడం గొప్ప విషయం అని కొనియాడారు. బచ్చమ్మ స్పూర్తితో సమాజంలో అన్ని వర్గాల ప్రజలు మెడికల్ కళాశాలలకు మృతదేహాలను అప్పగించడానికి ముందుకు రావాలని డాక్టర్ వీరన్న పిలుపునిచ్చారు. ఈ..కార్యక్రమంలో మెడికల్ కాలేజీ అనాటమీ ప్రొఫెసర్ డాక్టర్ భరత్ కుమార్ తోపాటు కురవి గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, బచ్చమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.















