ఈతరం భారతం మహబూబాబాద్ అక్టోబర్ 7 :మహబూబాబాద్ టౌన్ పరిధిలోని ఒక జ్యువెలరీ షాప్ లో బంగారం కొనటానికి వెళ్ళి షాపులో ఉన్న బంగారపు చెవికమ్మలు దొంగిలించిన ముగ్గురు అంతర్రాష్ట్ర మహిళా దొంగలైన 1) బొజ్జగాని నాగేంద్రమ్మ, W/o అచ్చయ్య, 74 సం,,లు, కులం: ఎరుకల, వృతి: కూలి, R/o రాయపట్నం, మధిర మండలం, ఖమ్మం జిల్లా, 2) బాలసాని నాగమణి, W/o మోహనరావు, 41 సం,,లు, కులం: ఎరుకల, వృతి: కూలి, R/o గోకరాజుపల్లి, వేర్లపాడు మండలం, NTR జిల్లా, ఆంధ్రప్రదేశ్ మరియు 3) మేచర్ల రేణుక, W/o వెంకటేశ్వర్లు, 51 సం,,లు, కులం: ఎరుకల, వృతి: కూలి, R/o గోకరాజుపల్లి, వేర్లపాడు మండలం, NTR జిల్లా, ఆంధ్రప్రదేశ్ అనే ముగ్గురు మహిళలు దొంగతనం చేసినారు. వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. వీరు గతంలో భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, మధిర, నకిరేకల్ మరియు మహంకాళి పీఎస్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.















