ఈ తరం భారతం మహబూబాబాద్ ఆగస్టు 31 :మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ గా సిఐ చంద్రమౌళి ని నియమిస్తూ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశాలు జారీచేశారు.ఈ మేరకు ఆయన డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు.ఇంతకాలం స్పెషల్ బ్రాంచ్ సిఐ గా మహబూబాబాద్ జిల్లాలోనే చంద్రమౌళి విధులు నిర్వహించారు.ఇటీవల డోర్నకల్ సిఐ లంచం తీసుకుంటూ ఏసిబి కి పట్టుబడిన నేపథ్యంలో ఖాళీ అయిన డోర్నకల్ సిఐ స్థానంలో చంద్రమౌళి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా సిఐ చంద్రమౌళి మాట్లాడుతూ… డోర్నకల్ పిఎస్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు తమ సమస్యలను ఏలాంటి భయాందోళన చెందకుండా నేరుగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజల సమస్యలకు చట్టం ద్వారా పరిష్కారం చూపిస్తామని సీఐ తెలిపారు. డోర్నకల్ పిఎస్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాలు, దందాలను ప్రజల సహకారంతో నిర్మూలిస్తామని సిఐ చంద్రమౌళి స్పష్టం చేసారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ చంద్రమౌళిని డోర్నకల్ పిఎస్ పరిధి లోని ఎస్ఐ లు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు.















