ఈ తరంభారతం మహబూబాబాద్ సెప్టెంబర్ 6 :డోర్నకల్ మండలం ముల్కలపల్లి ముత్యాలమ్మ బజారులో గణేష్ మండలం వద్ద లడ్డు వేలం పాటను నిర్వహించారు. ఈ లడ్డూ వేలం పాటలో గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు షేక్ సోందు సాహెబ్- నజీమా పాల్గొన్నారు. దంపతులు ఈ లడ్డూని రూ.20,116/- పాట పాడి వారు దక్కించుకున్నారు. వారిని ఫొటోస్, వీడియోస్ తీసి, ఇంటి వద్దకు డీజే చప్పుళ్ళతో, మహిళలు కోలాటాలతో తీసుకెళ్లారు. మతాలు వేరైనా మనుషులందరు ఒకటే అని మాటకు ఈ వేలం పాట నిదర్శనం.















