డోర్నకల్,జులై 24,(ఈతరం భారతం): భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున డోర్నకల్ మండల వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ ఇమ్మానుయేల్ సూచించారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తూ ప్రమాదం ఉన్నందున, వాగులు, చెరువులు, మరియు పూర్వం నీరు పొంగిన ప్రాంతాలకు ఎవ్వరూ వెళ్లొద్దని తెలిపారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో అవసరమన్నారు. వరదలకు అవకాశం ఉన్న ప్రదేశాల్లో అధికారులు, తమ సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకుంటున్నారన్నారు.ఎవరైనా ప్రమాదంలో ఉన్నారనిపిస్తే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచిస్తున్నట్లు తెలిపారు.
వాగులు, చెరువులు దాతుకుంటూ ప్రయాణించద్దన్నారు.పాత ఇళ్లు, గోడలు ఉన్న చోట అప్రమత్తంగా ఉండండాలన్నారు.విద్యుత్ తీగలు తెగిపడినచో వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఎవరినైనా సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉంటే అధికారులతో సంప్రదించాలన్నారు.అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన నంబర్లు తహసీల్దార్ – డోర్నకల్: 7995074781. ప్రభుత్వ అధికారులకు సహకరించాలన్నారు. అదేవిధంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వర్షాల నేపథ్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్: 7995074803 భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ,సమస్యలు వచ్చినా ఈ కంట్రోల్ మెంబర్ కి సంప్రదించవచ్చని తాసిల్దారు ఇమ్మానుయేల్ తెలిపారు.















