EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తొలి ప్రాధాన్యత : సిఎం రేవంత్ రెడ్డి

ఈతరం భారతం మహబూబ్ నగర్ జనవరి 17

ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తన తొలి ప్రాధాన్యత అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. భాష అనేది కేవలం కమ్యూనికేషన్ సాధన మాత్రమేనని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా లో పర్యటించారు. రూ. 200 కోట్లతో చిట్టబోయినపల్లిలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి భూమిపూజ చేశారు. మహబూబ్ నగర్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జడ్చర్లలో ఆయన ప్రసంగించారు. భాషతో పాటు నాలెడ్జ్ ను కూడా పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని, ప్రభుత్వం పేదలకు నాణ్యమైన విద్య అందిస్తుందని తెలియజేశారు. విద్య వల్లే పేదల బతుకులు మారతాయని, అందుకోసమే తాము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు చిత్తశుద్ధి, పట్టుదల ఉండాలని, విద్య ఒక్కటే జీవితాలను మారుస్తుందని, చదువుకున్న వారికి సమాజంలోగౌరవం ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపి డికె అరుణ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

 

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top