EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

కేసిఆర్ నిజస్వరూపం తెలవడానికి 9 సంవత్సరాలు పడితే…         రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలపడానికి 9 నెలలే పట్టింది

మంచిర్యాల ఫిబ్రవరి (ఈతరం భారతం ); భారతీ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలుగా మల్కా కొమరయ్య, పులి సరోత్తం రెడ్డి లను గెలిపించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం మంచిర్యాల బిజెపి పార్టీ కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి తో కలిసి మాట్లాడారు. నిరుద్యోగులు గ్రాడ్యుయేట్లు టీచర్లు లెక్చరర్లు మీరంతా మేధావులు.అన్ని విషయాలపట్ల అవగాహన న్నవారు.అన్ని పార్టీల చరిత్రను కల్లారా చూసినవారు.ఇప్పుడు మీ వైపు తెలంగాణ సమాజమంతా చూస్తుంది. తెలంగాణ సమాజం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ఒక సంకేతాన్ని ఇచ్చింది. దిక్సూచిగా నిలిచింది. ఆ ప్రజల అభిప్రాయం మేరకు మీరు కూడా బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తొమ్మిది న్నర సంవత్సరాలు టిఆర్ఎస్ చూసాము..ఎన్నో సంవత్సరాలు చూసినా మరోసారి అవకాశం ఇద్దామని కాంగ్రెస్ కి ఓటు వేసాము.కేసిఆర్ నిజస్వరూపం తెలవడానికి 9 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి నిజస్వరూపం తెలపడానికి 9 నెలలే పట్టింది.ఈ రెండు పార్టీలు మాకు వద్దు బీజేపీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని.. ప్రజల ఆలోచనను బలపరిచే విధంగా మీ తీర్పు ఉంటుందని భావిస్తున్నాము. 317 జీవో తీసుకొచ్చి కేసీఆర్ టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేశారు.భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర. పుట్టిన జిల్లా ఒకటి పని చేసే జిల్లా మరొకటి ఇలా కెసిఆర్ నరకం చూపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రభుత్వం రాగానే ఈ జీవో ని సరిచేస్తామని మీ ఇచ్చింది. ఆ పని చేయక టీచర్ల దగ్గరికి వెళ్లే ముఖం లేక డైరెక్ట్ గా అభ్యర్థిని పెట్టలేదు. టీచర్లు లెక్చరర్లు మీ సమస్యలు, 317 జీవో, సిపిఎస్ పెన్షన్ విధానం, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఐదు డిఏల పెండింగ్, మీకు ఇస్తా అన్న హెల్త్ కార్డులు, పదివేల స్కూల్లో హెడ్మాస్టర్ పోస్టులు, ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు.. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా టీచర్లను కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందన్నారు. .ఎవరు గెలిచినా మేము కాంగ్రెస్ కు పోతామని మాట్లాడుతున్నారు.అధికార పార్టీ వారు గెలిస్తే మీ కళ్ళల్లో మట్టి కొట్టి బానిస లెక్క ఉంటారు.రేపు మీ సమస్యల పట్ల కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే.కెసిఆర్.. నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాల కల్పన చేస్తానని చేయలేదు అందుకే ఆయనను ఓడగోట్టారు. కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ చేత నిరుద్యోగులకు పాలసీని ప్రకటించారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నాలుగు వేల భృతి ఇస్తామన్నారు. 2లక్షల కొత్త ఉద్యోగాలు నింపుతామన్నారు. 10 లక్షల రూపాయల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ రుణాలు ఇస్తామన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రైవేటు కంపెనీలలో ఐటీ కంపెనీలలో తెలంగాణ యువతకు 75% లోకల్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు.ఏ ఒక్కటైనా అమలు చేయలేదని విమర్శించారు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నారు తప్ప కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ అర్థమయ్యే రేవంత్ రెడ్డి నిన్న వచ్చి వారు గెలిచే పరిస్థితి లేదు అని తేల్చిచెప్పారు. ఈ ఒక్క ఎమ్మెల్సీ గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి.. గెలిచిన ఓడిన నా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదని చెప్పి ఆయన మాట్లాడారు.ఆయనకు ఆశలు సన్నగిల్లాయి.అందువల్ల పట్టభద్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య అర్థం చేసుకొని 140 కోట్లలో కోట్ల మంది యువతను దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకపోతే దేశ నిర్మాణం చేయలేమని.. 11 ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగిన దేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే యువతను భాగస్వాములు చేయాలని నాలుగు లక్షల కోట్ల రూపాయలు 2024 – 25 బడ్జెట్లో పెట్టారు.స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసారన్నారు. ఇక్కడ ఉన్న కంపెనీలలో ఉద్యోగుల కల్పన కోసం.. ప్రైవేటు కంపెనీలను పెట్టుకోవడానికి వడ్డీ లేని రుణాలు ఇచ్చి నిరుద్యోగ సమస్య రూపుమాపేందుకు బాటలు వేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పతనమైనా.. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుంది.మోడీ గారి అండదండలతో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టితో గొప్పగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. బిఆర్ఎస్ ముగిసిన కథ. కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఎక్కడికక్కడే కూడబల్కొని ప్రలోభాలను, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను, డబ్బు ప్రవాహాన్ని అడ్డుకొని.. ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించండని పిలుపునిచ్చారు. రేపటి మీ సమస్యల పరిష్కారం కోసం అండగా ఉండే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నేను చేతులు జోడించి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.పార్లమెంట్లో మేమున్నాము అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు శాసన మండలిలో కూడా మీ పక్షాన కొట్లడడానికి గళమెత్తే అవకాశాన్ని ఇవ్వాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top