ఈతరం భారతం మెదక్ ఫిబ్రవరి 16
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించగా.. కొన్ని చోట్ల హంగ్ ఏర్పడింది. అలా హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా కూడా ఉంది. సోమవారం ఈ మున్సిపాలిటీల్లో పలు పార్టీలు విజయం సాధించాయి. ఆ పార్టీల వివరాలు ఇలా.. 1.ఇస్నాపూర్ మున్సిపాలిటీని ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్ అఫిషియో ఓటుతో దక్కించుకున్న బిఆర్ఎస్2.జిన్నారం మున్సిపాలిటీని బిజెపి కౌన్సిలర్ల మద్దతుతో గెలిచిన బిఆర్ఎస్ 3.నర్సాపూర్ మున్సిపాలిటీని బిజెపి కౌన్సిలర్ల మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ 4.కోహిర్ మున్సిపాలిటీని ఎంఐఎం మద్దతుతో గెలిచిన కాంగ్రెస్ 5.మెదక్ మున్సిపాలిటీని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓటుతో దక్కించుకున్న కాంగ్రెస్ 6.కోరం లేక వాయిదపడ్డ జహీరాబాద్ మున్సిపాలిటీ.















