ఈతరం భారతం జనవరి 11 మెదక్:
ఏడుపాయల వన దుర్గామాత దేవాలయం సమీపంలోని ఘనపూర్ అనకట్ట వద్ద కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించిన కామారెడ్డి జిల్లాకు చెందిన బసవయ్యను QRT-1 పోలీస్ టీమ్ ప్రాణాలకు తెగించి కాపాడింది. ఘటన సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న QRT-1 సిబ్బంది ఏఆర్ ఎస్‌ఐలు శ్రీనివాస్, సాయిలు తదితరులు పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. ప్రమాదకరమైన నది ప్రవాహంలోకి దిగి తాడు సహాయంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనను చూసిన స్థానికులు పోలీసుల ధైర్యసాహసాలు, సమయస్ఫూర్తిని ప్రశంసించారు. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడిన QRT సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు అభినందించారు.















