ఏడుపాయల ఆగష్టు 18 (ఈ తరం భారతం);: సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయటంతో మంజీరానది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలోని వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. భారీ వరదతో ఆరు రోజులుగా ఏడుపాయల ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్నది. గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట వైపు, గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.















