EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

రోడ్డు ప్రమాద బాధితుని వైద్యానికి వెస్సో సహాయం

మెదక్ మే 11 (ఈతరం భారతం );వడ్రంగి వృత్తి లో ఉన్న వడ్ల రాజశేఖర్(28) మెదక్ జిల్లా, శివంపేట మండలం, కొంతన్‌పల్లి గ్రామ నివాసి. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని తలకు బలమైన గాయం అయింది. వెంటనే హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఆసుపత్రిలో అత్యవసర మెదడు శస్త్రచికిత్స చేసారు. శస్త్రచికిత్స అనంతరం అతనికి తరచూ మూర్చ రావడం ప్రారంభమైంది. అంతే కాకుండా, అతని కుడి భాగానికి పక్షవాతం వచ్చి, తన ఉపాధిని కోల్పోయారు. అతని భార్య మరియు పిల్లలు ఈ సంక్షోభ సమయంలో అతనిని వదిలిపెట్టి వెళ్లిపోవడం వల్ల కుటుంబ బాధ్యతలన్నీ వృద్ధాప్యంలో ఉన్న ఆయన అతని తల్లిదండ్రులపై పడింది. ప్రస్తుతానికి కొంతమంది మిత్రులు వారి రోజువారీ అవసరాలకు సహాయం చేస్తున్నారు.రాజశేఖర్ కు నెలకు సుమారుగా రూ.5,000/-ల విలువైన మందులు మరియు ఫిజియోథెరపీ అవసరం ఉంది. అతని వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించమని, రాజశేఖర్ కుటుంబ స్నేహితుడు వెస్సో ని ఆశ్రయించగా, రాజశేఖర్ కు వెస్సో ట్రస్టీలు రూ.41,600/-లు అందజేశారు. ఈ సందర్భంగా వెస్సో ట్రస్ట్ అధ్యక్షులు బంగారు తాతారావు మాట్లాడుతూ అనుకోని ఆపదతో వృత్తికి దూరమై, వైద్య ఖర్చుల నిమిత్తం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాజశేఖర్ కు ఆర్థిక సహాయం చేసి ఆదుకొన్న గౌరవ దాతలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top