ఈతరం భారతం ములుగు సెప్టెంబర్ 28
________________________________
తెలంగాణ : ములుగు జిల్లాలో రెండేళ్లకొకసారి నిర్వహించే మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతర తేదీలను పూజారులు ప్రకటించారు. జాతర కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు తేదీలను వెల్లడించారు. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు మేడారం చిన్నజాతర జరగనుందని తెలిపారు. జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని జగ్గారావు అధికారులను కోరారు.















