EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాశ్రమంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు

*శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాశ్రమంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు*

ఈతరం భారతం బాసర సెప్టెంబర్ 22

_______________________________

శ్రీ వాగ్దేవి సంస్కృత భారతి ఆధ్వర్యంలో బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి దేవాలయ సమీపంలో గల శివయోగి నిర్మల అంబయ్య సిద్ధాంతి సిద్ధాశ్రమ ము కోటి పార్థివశివలింగ శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగమందిర మాసోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా దీపారాధన, కలశ స్థాపన ,విఘ్నెశ్వరశ్వర పూజ ,కోటి పార్థివ లింగ , శ్రీ మేధా దక్షిణామూర్తి సహిత ద్వాదశ జ్యోతిర్లింగములకు మహా రుద్రాభిషేకం పుష్పార్చన , బిల్వార్చన , గోపూజ ,గణపతి, నవగ్రహ, రుద్రహోమములు, భూదాన సంకల్ప పూజ, మహా అన్నదానము నిర్వహించారు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సమయతి ఆర్ట్స్ అకాడమి వ్యవస్థాపక అధ్యక్షులు నాట్యగురువులు మహేష్ శిష్యులు చేసిన నృత్యము ప్రేక్షకులకు ఆకట్టుకున్నది. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శివశ్రీ నిర్మల అంబికానాధశర్మ నాట్య గురువు మహేష్ కు ఉత్తమ సాంస్కృతిక నాట్య సేవా పురస్కారం అందజేశారు. నిజామాబాద్ గౌతమ్ నగర్ ఎన్జీవోఎస్ కాలనీ అధ్యక్షులు పార్శి చక్రపాణి అరుణ దంపతులు, పుష్పలత సంగీత మనస్విని పార్శి సులోచన తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top