ఈతరం భారతం నిజామాబాద్ జనవరి 13
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం గుత్పా గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డ్ కార్యక్రమం గుత్పా గ్రామంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సహకారంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వెల్నెస్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ బృందం ద్వారా గుత్పా గ్రామ ప్రజలకు ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు నమోదు చేయబడాయి. ఈ హెల్త్ కార్డుల ద్వారా కుటుంబాలు వివిధ వైద్య సేవలను ప్రత్యేక రాయితీలతో పొందగలుగుతాయి.ఈ కార్యక్రమాన్ని వుమెన్ రైట్స్ పి.ఆర్.ఏ. ప్రమోద్ పర్యవేక్షణలో నిర్వహించారు గుత్పా ప్రజలు వెల్నెస్ హాస్పిటల్స్‌కు, అలాగే గ్రామ నాయకత్వానికి ఈ ప్రజాప్రయోజనకరమైన ఆరోగ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారోగ్యంపై వెల్నెస్ హాస్పిటల్స్ నిబద్ధతకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది.















