ఈతరం భారతం/నిజామాబాద్/అక్టోబర్ 23 :
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, సురక్షితమైన సేవలను అందించడం ఆర్టీసీ యొక్క ప్రధాన లక్ష్యమని. ఉన్నత అధికారుల సూచనా మేరకు ప్రయాణికులకు ప్రతి బస్సు లోని డ్రైవర్ మరియు కండక్టర్లు నమస్కరించి వారిని పరిచయం చేసుకొని అట్టి సర్విస్ వివరాలు మరియు గమ్యస్థానం చేరు సమయం తెలుపుతూ టీజిఎస్ఆర్టీసీ బస్సు లో ప్రయాణిస్తునందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చడం తమ బాధ్యత అని తెలుపుతూ ఎల్లప్పుడు టీజిఎస్ఆర్టీసీ బస్సులోనే ప్రయనించమని మరో మారు వారికి ధన్యవాదాలు తెలుపుతారని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ శ్రీమతి టి. జోస్నా ఒక ప్రకటనలో తెలిపారు.















