ఈతరం భారతం/నిజామాబాద్/అక్టోబర్ 18 :
హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ఈ. ప్రమోద్ (CCS constable Pramod) అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం టౌన్ 3 పరిదిలోని న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు.ఇట్టి అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్ మరియు నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్., గారు హాజరు అయి పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు.అనంతరం IGP ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.
అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అతనకు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, CTC , CCS ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు , భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.















