EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

మందాపూర్ గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్స్ ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డ్ కార్యక్రమం

ఈతరం భారతం నిజామాబాద్ జనవరి 6

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం మందాపూర్ గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డ్ కార్యక్రమం మందాపూర్ గ్రామంలో విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ అల్లారి మహేష్, ఉప సర్పంచ్ శ్రీమతి బెగారి శిరీష సుమన్ మరియు గ్రామ సెక్రటరీ శ్రీమతి రత్న కుమారి అనుమతి మరియు సహకారంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వెల్నెస్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ బృందం ద్వారా మందాపూర్ గ్రామ ప్రజలకు మొత్తం 60 ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డులు నమోదు చేయబడాయి. ఈ హెల్త్ కార్డుల ద్వారా కుటుంబాలు వివిధ వైద్య సేవలను ప్రత్యేక రాయితీలతో పొందగలుగుతాయి.ఈ కార్యక్రమాన్ని వుమెన్ రైట్స్ పి.ఆర్.ఏ. ప్రమోద్ పర్యవేక్షణలో భీమా గౌడ్, ప్రకాష్, గోపాల్, వాణి, గంగాధర్, ప్రదీప్ శ్రీ సాయి మరియు సింధు వారి సహకారంతో సజావుగా నిర్వహించారు.గ్రామ ప్రజలు వెల్నెస్ హాస్పిటల్స్‌కు, అలాగే గ్రామ నాయకత్వానికి ఈ ప్రజాప్రయోజనకరమైన ఆరోగ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజారోగ్యంపై వెల్నెస్ హాస్పిటల్స్ నిబద్ధతకు ఇది మరో నిదర్శనంగా నిలిచింది.

Related News

Select the Topic
Scroll to Top