EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

రామస్వామి క్యాంప్ గ్రామంలో ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డ్ కార్యక్రమం విజయవంతం

ఈతరం భారతం నిజామాబాద్ (ఆలూరు) జనవరి 2

రామస్వామి క్యాంప్ గ్రామంలో వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డ్ నమోదు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెల్నెస్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ బృందం గ్రామస్తులకు ఫ్యామిలీ హెల్త్ కార్డుల ప్రయోజనాలపై అవగాహన కల్పించి, మొత్తం 110 ఫ్యామిలీ హెల్త్ కార్డులను నమోదు చేశారు.ఈ కార్యక్రమం సుమన్, ప్రమోద్, సిడ్డు మరియు ప్రభు చరణ్ పర్యవేక్షణలో సక్రమంగా జరిగింది. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, వెల్నెస్ హాస్పిటల్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ స్థాయిలో ఆరోగ్య సేవలను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని వెల్నెస్ హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ పసుల పుష్ప మరియు ఉప సర్పంచ్ సైలూ తదితేరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top