EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

సమగ్ర సీపీఆర్ అవగాహన కార్యక్రమం – ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నిజామాబాద్

ఈతరం భారతం/నిజామాబాద్/అక్టోబర్ 18 :

ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 13–17 అక్టోబర్ 2025 మధ్య నిర్వహిస్తున్న కార్డియో-పల్మనరీ రీసస్సిటేషన్ (సీపీఆర్) అవగాహన వారోత్సవం లో భాగంగా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్), నిజామాబాద్‌లో నర్సింగ్ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది మరియు శానిటేషన్ & సెక్యూరిటీ సిబ్బంది కోసం ఒక సమగ్ర సీపీఆర్ అవగాహన మరియు ప్రాక్టికల్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డా. జలగం తిరుపతి రావు, హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ మార్గదర్శనం అందించగా, డా. శివకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్ మరియు డా. ప్రత్యూష, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ యానస్థీషియాలజీ డెమో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డా. పి. శ్రీనివాస్, సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, నిజామాబాద్, డా. విజయ్ కుమార్, హెచ్ఓడి అండ్ ప్రొఫెసర్, జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్, మరియు శ్రీమతి చంద్రకళ, నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–I పాల్గొన్నారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో 180 మందికి పైగా పాల్గొన్నారు . వారికి CPR పైన అవగాహన కల్పించారు.

Related News

Select the Topic
Scroll to Top