ఈతరం భారతం డిసెంబర్ హైదరాబాద్ 21
రంగారెడ్డి జిల్లా కొహెడలో హైదరాబాద్ వాసులకు తక్కువ ధరకే తాజా చేపలను అందించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 13 ఎకరాల అంతర్జాతీయ ఫిష్ ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.47 కోట్లు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర మత్స్య మంత్రి వాకిటి శ్రీహరి ఈ కేంద్రం మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని, హైదరాబాద్ నగరానికి తాజా మరియు తక్కువ ధరలో చేపలు అందుతాయని తెలిపారు. కొహెడలోని సర్వే నం.167లో నిర్మాణం ప్రారంభమయ్యే ఈ హబ్, మద్యవర్తుల అవసరాన్ని తగ్గించి, నేరుగా వినియోగదారులకు ఫిష్ అందించనుంది. ఈ కేంద్రంలో అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.















