మహేశ్వరం ఆగస్టు 7 (ఈతరం భారతం)మహేశ్వరం నియోజకవర్గంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి “రేషన్ కార్డులు పంపిణీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు (ఐటీ, పరిశ్రమలు & ఎలక్ట్రానిక్స్, శాసనసభ వ్యవహారాల శాఖ) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఆయనతో కలిసి టిపిసిసి అధికార ప్రతినిధి వెదిరె యోగేశ్వర్ రెడ్డి పాల్గొనడం జరిగింది.ఈ సందర్బంగా యోగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పేదల సంక్షేమమే లక్ష్యంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ దిశగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక ముఖ్యమైన మైలు రాయిగా నిలుస్తోంది.ప్రజల అభిమానం చూసి ఓర్వలేని కొంతమంది ప్రతిపక్ష నాయకులు, శాసనసభ్యులు రాజకీయ స్వార్థంతో నిరుత్సాహపర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ప్రజలను విస్మరించిన వారు ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం చుట్టూ జరుగుతున్న మార్పును చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ ప్రభుత్వం సంకల్పబలంతో, ప్రజల మద్దతుతో పేదల పక్షాన నిలబడి, ప్రతి కుటుంబానికి అండగా ఉండే నూతన తెలంగాణ నిర్మాణం వైపు వేగంగా కదులుతుందన్నారు.















