EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వైభవంగా సంగారెడ్డి సాయిబాబా ఆలయ రజతోత్సవాలు

ఈ తరం భారతం సంగారెడ్డి అక్టోబర్ 24:

_________________________________

పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల సాయిబాబా ఆలయం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన రజతోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ పర్యవేక్షణలో, జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి సహకారంతో మూడు రోజులపాటు యజ్ఞయాగాదులు, కుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

కూకట్‌పల్లికి చెందిన నరేష్ పంతులు నేతృత్వంలో 30 మంది వేద పండితులు ఈ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. మొదటి రోజు సుదర్శన యాగం, రెండో రోజు శత కలశాభిషేకం, మూడో రోజు శిఖర కుంభాభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ సాగిన పూజలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

మూడో రోజు జరిగిన శిఖర కుంభాభిషేకంలో నిర్మల జగ్గారెడ్డి పాల్గొని సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్యులు టీ. కాశప్ప, కేవీ నర్సయ్య, ఎస్. వీరేందర్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top