ఈతరం భారతం సిద్దిపేట మార్చ్ 11
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టాలో నూతనంగా నిర్మించిన ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ఈనెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యవసాయ యాంత్రికీకరణ పథకంలో భాగంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ మండలాలకు చెందిన 38 మంది రైతులకు 53 లక్షల 80 వేల రూపాయల విలువైన 36 రోటోవేటర్లు, 2 స్ట్రాబెలర్స్( గడ్డిని కట్టకట్టే యంత్రాలు) వ్యవసాయ పరికరాలను 50% సబ్సిడీతో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులకు శ్రమను తగ్గించి అధిక దిగుబడులను సాధించేందుకు అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రికరణ పథకం ద్వారా వ్యవసాయ పనిముట్లను తీసుకోవాలని రైతులకు సూచించారు















