ఈతరం భారతం సిద్దిపేట అక్టోబర్ 12 :సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ ఆదివారం 5 వ సంవత్సరం 104 వ రోజుకు చేరుకుంది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఉపాధ్యక్షుడు అయిత సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం అని,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త యాదగిరి గుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజక వర్గం కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు అరటి పండ్లు బ్రెడ్ పంపిణి చేసి నిరుపేదలకు చీరలు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్ సామా శ్రీధర్,లయన్ గుడాల శేఖర్,రాము, తదితరులు పాల్గొన్నారు















