EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 1,50,000 Viewership

దుబ్బాక పట్టణంలో జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఈతరం భారతం సిద్దిపేట జనవరి 26

సిద్దిపేట జిల్లాలో జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకులు మచ్చ శ్రీనివాస్, నరేష్ లు ఫిర్యాదు చేశారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా దుబ్బాక పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేశారు. దీంతో దుబ్బాక స్థానిక కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండాను అవమానించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గాంధీ చౌరస్తా వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాజకీయ విమర్శలు చేయడంతో కాంగ్రెస్ బిఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం ఏర్పడింది. ఇది వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాకుండా పెద్దపెద్ద పెట్టున నినాదాలు చేశారు

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top