ఈతరం భారతం సెప్టెంబర్ 10 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ : లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320 డి లో 2024 – 25 సంవత్సరంలో మీల్స్ ఆన్ వీల్స్ బెస్ట్ అవార్డు సర్వీస్ అవార్డ్ అందుకున్న లయన్ సామ శ్రీధర్ కు బుధవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి స్వగృహం లో ఐ వి ఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆర్యవైశ్య నాయకులతో కలిసి లయన్ సామ శ్రీధర్ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా ఎన్ సీ రాజమౌళి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీల్స్ ఆన్ వీల్స్ బెస్ట్ సర్వీస్ అవార్డ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు బెస్ట్ సర్వీస్ అవార్డ్ అందజేసిన సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగిందని వారు ఇలాంటీ అవార్డులు మరిన్ని అందుకోవాలని అన్నారు,అనంతరం లయన్ సామ శ్రీధర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో నేను సైతం భాగస్వామ్యం కావడం, నా సేవలు గుర్తించి నాకు అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్క లయన్స్ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఇంటర్ నేషనల్ వైశ్య ఫెడరేషన్ ధార్మిక చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి, కిరాణా అసోసియేష్ అధ్యక్షుడు సిద్ది బిక్షపతి, సీనియర్ నాయకుడు తోట బిక్షపతి,కొండ పోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ గోలి సంతోష్,సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్, లెంకల పల్లి శ్రీనివాస్, కొమరవెల్లి శంకరయ్య,ఉత్తునూరి సంపత్,సైదులు, రాము తదితరులు పాల్గొన్నారు















