EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సిద్దిపేట జిల్లా పదేళ్ల ఆవిర్భవ దినోత్సవ  వేడుకలు

ఈతరం భారతం సిద్దిపేట అక్టోబర్ 11 ;

__________________________________

సిద్దిపేట జిల్లా సిద్ధించి పదేళ్లు కావస్తున్నా ఆశించిన ఫలితాలు రాలేదని సిద్దిపేట జిల్లా ఫోరం సమన్వయకర్త తుమ్మనపల్లి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం స్థానిక విఎ ఆర్ గార్డెన్స్ లో పదవ ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై విధంగా అన్నారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఫోరం అధ్యక్షులు వంగ రామచంద్ర రెడ్డి అధ్యక్షత వహించారు. తుమ్మనపల్లి మాట్లాడుతూ జిల్లా ఏర్పడ్డ తర్వాత ఈ నేటి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కాలేదని దశాబ్దాలుగా సిద్దిపేట కేంద్రంగా యూనివర్సిటీని అడిగినా, యువతకు ఉపాధి కల్పెంచడం కోసం పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని అడిగినా, రాజీవ్ రహదారిని విస్తరించమని అడిగినా గత పాలకులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. ముఖ్యమైన ప్రజా సమస్యల పరిష్కారానికి మరో పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఫోరం అధ్యక్షులు వంగ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో పేరుకుపోయిన సమస్యలను పది విభాగాలలో నలభై అంశాలకు పైగా క్రోడీకరించి రూపొందించిన ఒక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు త్వరలో అందజేయనున్నట్లు తెలిపారు, సిద్దిపేట జిల్లా ఫోరం సజీవమైందని ఎప్పుడూ జిల్లా ప్రజల పక్షాన గొంతు ఎత్తుతుందని వచ్చే పదేళ్ల కాలానికి అవసరమైన ప్రణాళికతో ఫోరమ్ ముందుకు వెళ్తుందని ఆయన అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ఆంజా గౌడ్ పాట పాడి సభికులను ఉత్తేజ పరచగా ఉపాధ్యక్షులు గుర్రాల శ్రీనివాసు, బత్తుల నారాయణ, శ్రీరామ్ నవరత్నం, అమ్మన చంద్రా రెడ్డి, భూపతి రెడ్డి, బెజ్జంకి అశోక్, శేషుకుమార్, రాజేంద్ర ప్రసాద్ భట్, ముజఫర్ తదితరులు మాట్లాడారు. వక్తలందరూ జిల్లా సమస్యల పరిష్కారం కై పోరాటం చేయాలని ముక్త కంఠంతో నినదించారు.ఇంకా ఈ కార్యక్రమంలో కరికే శ్రీనివాసు, పోతిరెడ్డి వీరారెడ్డి, మాచవరం వెంకటేశ్వర రావు, రుద్రోజు శివకుమారు, కరెడ్ల రామచంద్రారెడ్డి, గౌస్, షంషోద్దీన్, తదితరులు పాల్గొని పదేళ్ల వేడుకలను విజయవంతం చేశారు

Related News

Select the Topic
Scroll to Top