ఈతరం భారతం/ సూర్యాపేట/ అక్టోబర్ 27 :
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తీసిన మద్యం టెండర్ల డ్రాలో భార్యాభర్తలను అదృష్టం వరించింది. జిల్లాలో 93 దుకాణాలకు 2070 దరఖాస్తులు చేసుకోగా సోమవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు. వీటిలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్ కు గెజిట్ నెంబర్ 21లో ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో షాపులు దక్కించుకున్నారు. వందల టెండర్లలో భార్యాభర్తలకు షాపులు దక్కడంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.














