కొడంగల్ నవంబర్ 4 (ఈతరం భారతం); : ప్రభుత్వం నూతనంగా కొడంగల్ నియోజకవర్గంలో మంజూరు చేసిన బిఎస్సి నర్సింగ్ కళాశాలకు ప్రిన్సిపల్ గా లిల్లీ మేరి ని నియమించింది. నేడు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువారం నుండి నేటి వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాల అడ్మిషన్ ప్రక్రియ జరిగిందని తెలిపారు. నర్సింగ్ కళాశాలలో మొత్తం 60 సీట్లకు ప్రభుత్వము అనుమతి ఇచ్చిందని ఆమె తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫై చేసి విద్యార్థులను కళాశాలలో చేర్చుకున్నామన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ను కొడంగల్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి మర్యాదపూర్వకంగా కలిసి నర్సింగ్ కళాశాలకు బిల్డింగు మరియు వసతులను కల్పించాలని ఆమె కోరారు.















